Pawan Kalyan: 'మద్యం మిధ్య.. తాగొద్దని చెప్పడానికి మనమెవరం'.. కార్టూన్ ను షేర్ చేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan shares satirical cartoon on AP liquor policy
  • వైసీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధం లేదన్న మంత్రి గుడివాడ అమర్ నాథ్
  • ప్రభుత్వ మద్య విధానాన్ని విమర్శిస్తూ కార్టూన్
  • అంతా తాగేవాడి ఇష్టం అంటూ సెటైరికల్ కార్టూన్
మద్యంపై వైసీపీ అనుసరిస్తున్న విధానాన్ని విమర్శిస్తూ ఉన్న ఒక కార్టూన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. 'మద్యం మిధ్య.. నిషేధం మిధ్య.. తాగమని, తాగొద్దని చెప్పడానికి మనమెవరం.. అంతా వాడిష్టం' అంటూ ఒక పేద మహిళకు హితబోధ చేస్తున్నట్టు కార్టూన్ లో ఉంది. 

నిన్నటి వరకు ఏపీ రోడ్ల దుస్థితిని కార్టూన్ ఇమేజీల ద్వారా ఎండగట్టిన పవన్ కల్యాణ్... ఇప్పుడు మద్య నిషేధంపై కార్టూన్ల ద్వారా విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదంటూ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కార్టూన్ ను రూపొందించారు. 


Pawan Kalyan
Janasena
YSRCP
Gudivada Amarnath

More Telugu News