Jayasudha: 'ఓపెన్ హార్ట్ 'కార్యక్రమానికి విచ్చేసిన జయసుధ... ప్రోమో హైలైట్స్ ఇవిగో!

Jayasudha at Open Heart With RK

  • ఆర్కే హోస్ట్ గా 'ఓపెన్ హార్ట్'
  • తాజాగా జయసుధతో ఇంటర్వ్యూ
  • ఆసక్తికర అంశాలు వెల్లడించిన జయసుధ

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ అధినేత ఆర్కే నిర్వహించే ఓపెన్ హార్ట్ కార్యక్రమానికి తాజాగా సినీ నటి జయసుధ విచ్చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా పేరుగాంచిన జయసుధ... ఏబీఎన్ రాధాకృష్ణతో ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఏబీఎన్ చానల్లో దర్శనమిస్తోంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమం నేటి రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది.

జయసుధ ఏమన్నదంటే...

  • అమ్మాయిలా కాదు, మగరాయుడిలా పెరిగాను. 
  • అందుకే ఇండస్ట్రీలో నా జోలికి ఎవరూ రాలేదు. 
  • శ్రీదేవికి, జయప్రదకు లేని ప్రత్యేకత నాకుంది. 
  • 8 నెలల గర్భంతో ఉండి కూడా నటించాను. 
  • చిత్రపరిశ్రమలో వివక్ష అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. 
  • హీరోయిన్ల కంటే హీరోలు ఎందులోనూ గొప్ప కాదు. 
  • శోభన్ బాబు మంగళవారం పనిచేయరు. 
  • రాజకీయాల్లో నన్ను ఏ పార్టీ కూడా పట్టించుకోలేదు. 
  • పద్మశ్రీ అవార్డులు వాళ్లకే వస్తాయి. 
  • 'మా' ఎన్నికలపై భారీగా బెట్టింగ్ జరిగింది.

Jayasudha
Open Heart With RK
Interview
Tollywood
  • Loading...

More Telugu News