Team India: కామన్వెల్త్ గేమ్స్: టీమిండియాకు 100 పరుగుల టార్గెట్ నిర్దేశించిన పాక్ అమ్మాయిలు

Team India openers gives rapid start against Pakistan Women
  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్
  • 32 పరుగులు చేసిన మునీబా అలీ
  • చెరో రెండు వికెట్లు తీసిన స్నేహ్ రాణా, రాధా యాదవ్
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగానే బర్మింగ్ హామ్ లో టీమిండియా, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ జట్టులో ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. కెప్టెన్ బిస్మా మారూఫ్ 17 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, రాధా యాదవ్ 2, రేణుకా సింగ్ 1, మేఘనా సింగ్ 1, షెఫాలీ వర్మ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 100 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. 4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. ఎడమచేతివాటం ఓపెనర్ స్మృతి మంధన 17 బంతుల్లో 28 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 7 బంతుల్లో 12 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే ఇంకా 84 బంతుల్లో 59 పరుగులు చేయాలి. కాగా, మ్యాచ్ కు ముందు వర్షం పడడంతో ఓవర్లను 18కి కుదించడం తెలిసిందే.
Team India
Pakistan
Women
Birmingham
Commonwealth Games

More Telugu News