Vijayasai Reddy: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 19 ఎంపీ స్థానాలు, 133 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఇండియా టీవీ చెప్పింది: విజయసాయి

Vijayasai reveals India TV survey

  • ఆసక్తికర ట్వీట్ చేసిన విజయసాయి
  • దేశ్ కీ ఆవాజ్ సర్వే వివరాలు వెల్లడి
  • వచ్చే 20 నెలల్లో మరింత పుంజుకుంటామని స్పష్టీకరణ
  • ఈసారి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా
  • 'గడప గడపకు...' కార్యక్రమం లాభిస్తుందని ఆశాభావం

ఏపీ ప్రజలు మరోమారు జగనే కావాలి అంటున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీకి 19 ఎంపీ స్థానాలు, 133 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సత్తా ఉందని ఇండియా టీవీ దేశ్ కీ ఆవాజ్ సర్వే స్పష్టం చేస్తోందని వెల్లడించారు. 

'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంతో వచ్చే 20 నెలల్లో వైసీపీ మరింత లబ్ది పొందుతుందని, 150 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
Elections
India TV
Desh Ki Awaaz
Survey
Andhra Pradesh
  • Loading...

More Telugu News