Ram Gopal Varma: ఓటీటీల వల్ల థియేటర్లకు నష్టం అన్న ఆరోపణలపై వర్మ ఘాటు స్పందన

Ram Gopal Varma says thinking OTT hurts theatres is dumb
  • దీన్ని మూగరోదన గా అభివర్ణించిన వర్మ
  • అశాస్త్రీయమైన వాదనగా కామెంట్
  • ఇంటికే ఫుడ్ తెప్పించుకునే అవకాశంతో హోటళ్లకు రారన్నట్టే ఉందని పోస్ట్
సినీ థియేటర్లకు ఓటీటీలతో నష్టం వాటిల్లుతుందన్న చర్చలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చేరిపోయారు. ఈ చర్చను మూగరోదనగా (డంబ్) ఆయన అభివర్ణించారు. కరోనా విపత్తు వచ్చిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ల విస్తరణతో.. సినిమాలు చూసేందుకు థియేటర్లకు వచ్చే వారు తగ్గిపోయారన్న వాదన నెలకొంది. ఇది సినిమా థియేటర్ల వ్యాపారాన్ని దెబ్బతీసిందని, ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు రావాలనుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. 

దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. దీన్ని డంబ్ గా ఆయన అభివర్ణించారు. ఈ చర్చను అర్థం, పర్థం లేనిదిగా ఆయన పేర్కొన్నారు. హోటల్స్ పరిశ్రమను ఇక్కడ ప్రస్తావించారు. ‘‘కావాల్సిన ఫుడ్ ను ఇంటి వద్దే పొందగలరు కాబట్టి ఎవరూ హోటల్స్, రెస్టారెంట్లకు రారు అన్నట్టుగానే ఉంది’’అని వర్మ ట్వీట్ చేశారు. కరోనా వచ్చిన తర్వాత నుంచి చాలా మంది థియేటర్లకు వెళ్లడం లేదన్నది నిజమే. దాంతో చాలా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా లో బడ్జెట్ చిత్రాలకు ఓటీటీలు ఆశావహ వేదికగా మారాయి.
Ram Gopal Varma
RGV
OTT
hurts
theatres
discussion
dumb

More Telugu News