Dulquer Salmaan: రష్మిక చాలా హుషారు: మృణాల్ ఠాకూర్

Sita Ramam Movie Update

  • సరికొత్త ప్రేమకథా చిత్రంగా 'సీతా రామం'
  • తెలుగు తెరకి మృణాల్ ఠాకూర్ పరిచయం
  • కీలకమైన పాత్రలో రష్మిక 
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల  

'సీతా రామం' సినిమాతో తెలుగు తెరకి మృణాల్ ఠాకూర్ పరిచయమవుతోంది. మరాఠీ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన మృణాల్, కొన్ని సీరియల్స్ లోను నటించింది. 'సీతా రామం' సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. ఈ  సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడింది.

"కుంకుమ భాగ్య' సీరియల్ ద్వారా నేను అందరికీ తెలిశాను. ఆ సీరియల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు నుంచి .. అందునా ఇంతమంచి ప్రాజెక్టు నుంచి నాకు ఛాన్స్ వస్తుందని అనుకోలేదు. అందునా టైటిల్ తో ముడిపడిన రోల్ చేస్తానని అస్సలు ఊహించలేదు. దుల్కర్ వంటి స్టార్ జోడీగా తెరపై కనిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇక రష్మిక పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడు చూసినా తాను చాలా యాక్టివ్ గా ఉంటుంది. చెన్నై .. ముంబై .. బెంగుళూర్ .. ఫారిన్ కి ఆమె విమానాల్లో తిరుగుతూ, వరుస సినిమాలు చేయడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. తన విషయంలో తాను ఎంత కేర్ తీసుకుంటుందో .. మిగతావారి విషయంలోను అంతే కేర్ తీసుకుంటుంది" అని చెప్పుకొచ్చింది.

Dulquer Salmaan
Mrunal Thakur
Sita Ramam Movie
  • Loading...

More Telugu News