Chinese: హిందూ మహాసముద్రంలో కూలిపోయిన చైనా రాకెట్.. వీడియో ఇదిగో..

Chinese space rocket lights up night sky before crashing into Indian Ocean

  • జులై 24న ద లాంగ్ మార్చ్ 5బీ వై3 రాకెట్ ను ప్రయోగించిన చైనా
  • నిర్మాణంలోని అంతరిక్ష కేంద్రానికి మాడ్యూల్ డెలివరీ చేసే లక్ష్యం
  • హిందూ మహా సముద్రంలో కూలిపోయిన రాకెట్

చైనాకు చెందిన ఓ రాకెట్ కూలిపోగా, ఆ శిధిలాలు భూ వాతావరణంలోకి చేరిన తర్వాత ప్రకాశవంతంగా వెలిగిపోతూ నింగిని ఆకర్షణీయంగా మార్చేశాయి. చైనా ‘ద లాంగ్ మార్చ్ 5బీ వై3 రాకెట్’ను జులై 24న ప్రయోగించింది. ఏమైందో కానీ, ఈ రాకెట్ మలేషియాకు చెందిన కుచింగ్ పట్టణం ఉపరితలంలో విచ్ఛిన్నమైంది. శనివారం దీని తాలూకూ శకలాలు హిందూ మహా సముద్రంలో పడిపోయాయి. 

పడిపోతున్న సమయంలో భూవాతావరణంలోకి చేరిన తర్వాత రాకెట్ శకలాలు దీపావళి క్రాకర్ల మాదిరి వెలిగిపోతూ (కాలిపోవడం) కనిపించాయి. దీన్ని ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. కాకపోతే సదరు ట్విట్టర్ యూజర్ దీన్ని గ్రహశకలంగా భావించాడు. యూఎస్ స్పేస్ కమాండ్ దీన్ని ద లాంగ్ మార్చ్ 5బీ వై3 రాకెట్ గా నిర్ధారించింది. చైనా నూతనంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి లాబొరేటరీ మాడ్యూల్ ను డెలివరీ చేసేందుకు గాను జులై 24న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ను ప్రయోగించింది.

More Telugu News