Warangal: టీఆర్ఎస్‌కు కన్నెబోయిన రాజయ్య యాదవ్ రాజీనామా

TRS leader Rajaiah Yadav quits

  • కేసీఆర్‌తో 22 ఏళ్లపాటు ఉద్యమంలో నడిచానన్న రాజయ్య
  • పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు ఇప్పుడు లేవని వ్యాఖ్య
  • బాధతోనే పార్టీని వీడుతున్నట్టు చెప్పిన రాజయ్య

సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ టీఆర్ఎస్‌ను వీడారు. హనుమకొండలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో ఒకప్పటి గౌరవ మర్యాదలు ఇప్పుడు లేవన్న ఆయన.. కేసీఆర్ కష్టసుఖాల్లో తాను పాలుపంచుకున్నానని, 22 ఏళ్లపాటు ఉద్యమంలో ఆయనతోపాటు నడిచానని గుర్తు చేసుకున్నారు. 

ఎంపీ, రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అన్నారు. సొంతపార్టీ నేతలను కూడా ఆయన ఎదగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బాధతోనే తాను పార్టీని వీడుతున్నట్టు రాజయ్య పేర్కొన్నారు.

Warangal
Telangana
Kanneboina Rajaiah Yadav
TRS
KCR
  • Loading...

More Telugu News