EAMCET: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కీ విడుదల

Telangana EAMCET Key released

  • జులై 18 నుంచి 20 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు
  • ప్రాథమిక సమాధానాల విడుదల
  • అభ్యంతరాలకు ఆగస్టు 1న సాయంత్రం 5 గంటల వరకు గడువు
  • ఆగస్టు 8 లోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశం

తెలంగాణలో జులై 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన కీ విడుదల చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక సమాధానాలతో కూడిన కీ విడుదల చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. 

కీలో పేర్కొన్న సమాధానాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వెబ్ సైట్ ద్వారా లింక్ సమర్పించాలని పేర్కొన్నారు. అందుకు ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని తెలిపారు. ఎంసెట్ ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ల కోసం https://eamcet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని వెల్లడించారు. 

తెలంగాణ ఎంసెట్ లో ఇంజినీరింగ్ పరీక్షకు 1,72,243 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో పరీక్షకు హాజరైంది 1,56,812 మంది మాత్రమే. పూర్తిస్థాయి ఫలితాలు ఆగస్టు 8వ తేదీలోగా విడుదల అవుతాయని భావిస్తున్నారు.

EAMCET
Key
Engineering
Telangana
  • Loading...

More Telugu News