Karthi: కార్తి 'విరుమన్' రిలీజ్ డేట్ ఖరారు!

Viruman movie release date confirmed

  • కార్తి హీరోగా రూపొందిన 'విరుమన్'
  • కథానాయికగా అదితి శంకర్ 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా 
  • ఆగస్టు 12వ తేదీన విడుదల

కార్తికి 'ఖైదీ' సినిమాకి ముందుగానీ .. ఆ తరువాతగాని హిట్స్ లేవు. అందువలన 'ఖైదీ' సీక్వెల్ ను సాధ్యమైనంత త్వరగా చేసేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'విరుమన్' సినిమాను రిలీజ్ కి రెడీ చేశాడు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించాడు.

ఆగస్టులో విక్రమ్ 'కోబ్రా' .. విశాల్ 'లాఠీ' ఉండటంతో, 'విరుమన్'ను దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన విక్రమ్ .. విశాల్ సినిమాలు పక్కకి తప్పుకున్నాయి. పోటీకి దగ్గర్లో పెద్ద సినిమాలు కూడా లేవు. దాంతో హఠాత్తుగా కార్తి సినిమా రంగం మీదికి వచ్చేసింది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. 

ఈ కథ నేపథ్యం విభిన్నంగా ఉంటుంది .. అందుకు తగినట్టుగానే కార్తి లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో సూర్య సరసన నాయికగా డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగులో నితిన్ .. నిఖిల్ సినిమాల పోటీని ఈ సినిమా ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Karthi
Adithi Shankar
Viruman Movie
  • Loading...

More Telugu News