Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు ఇష్టమైన పుస్తకాలు ఇవేనట!

Theses are the books Vijay Devarakonda likes very much
  • పుస్తక పఠనంపై విజయ్ కు ఆసక్తి
  • పలు పుస్తకాల గురించి వివరణ
  • 'ద ఫౌంటెన్ హెడ్' అందరూ చదవాలని సూచన 
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ తాను మంచి పుస్తక ప్రియుడ్ని అంటున్నారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాతో ముచ్చటిస్తూ తనకిష్టమైన పుస్తకాల జాబితాను పంచుకున్నారు. అయాన్ ర్యాండ్ రచించిన 'ద ఫౌంటెన్ హెడ్' పుస్తకం చదువుతుంటే ఎంతో బాగుంటుందని తెలిపారు. ఆసక్తి కలిగించే పాత్రల ద్వారా మనస్తత్వ విశ్లేషణ చేయడం ఈ పుస్తకంలో చూడొచ్చని, 'ద ఫౌంటెన్ హెడ్' పుస్తకాన్ని చదువుతుంటే మన చుట్టూ ఉన్న సమాజంతో మనం అనుసంధానమైన విషయాన్ని గుర్తిస్తామని తెలిపారు. ఇది సూపర్ ఇంట్రెస్టింగ్ పుస్తకం అని, దీన్ని ప్రతి ఒక్కరూ చదవాలని అన్నారు. 

అయాన్ ర్యాండ్ రాసిన 'అట్లాస్ ష్రగ్ డ్' కూడా చదవదగినదేనని విజయ్ పేర్కొన్నారు. ఇవేకాకుండా, రష్యన్ రచయిత కాన్ స్టాంటిన్ స్టానిస్లోవ్ స్కీ రాసిన 'యాన్ యాక్టర్ ప్రిపేర్స్', 'బిల్డింగ్ ఏ క్యారెక్టర్' పుస్తకాలు కూడా తనను ఆకట్టుకున్నాయని తెలిపాడు. నటన గురించి స్టానిస్లోవ్ స్కీ రాసిన ఈ పుస్తకాలను ఒకసారి చదివితే అర్థం చేసుకోలేమని, పలుమార్లు చదివిన తర్వాత తనకు అందులోని విషయాలు ఎంతో చక్కగా బోధపడ్డాయని వివరించారు. 

ఇక, స్టీఫెన్ ఆర్ కాన్వే రచించిన 'ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్', 'డాక్టర్ స్పెన్సర్ జాన్సన్' రచించిన 'హూ మూవ్డ్ మై చీజ్?' పుస్తకాలను చదువుతున్నప్పుడు కూడా తాను ఎంతగానో ఆస్వాదించానని విజయ్ దేవరకొండ వెల్లడించారు. ఈ రెండు పుస్తకాలు మోటివేషనల్ అంశాలకు సంబంధించిన పుస్తకాలని, ఇందులో 'హూ మూవ్డ్ మై చీజ్ పుస్తకం' చిన్నదే అయినా ఎంతో విషయం ఉన్న పుస్తకం అని వివరించారు.
Vijay Devarakonda
Books
Reading
Hero
Tollywood

More Telugu News