Will Smith: నేను తప్పు చేశాను: బహిరంగ క్షమాపణ చెప్పిన విల్ స్మిత్

Will Smith says apology to Chris Rock

  • ఆస్కార్ అవార్డుల వేదికపై క్రిస్ రాక్ చెంప ఛెళ్లుమనిపించిన విల్ స్మిత్
  • తొలిసారి బహిరంగ క్షమాపణ చెప్పిన విల్ స్మిత్
  • ఈ క్షమాపణ నీకు చాలదని స్మిత్ వ్యాఖ్య

94వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ చెంపను హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ఛెళ్లు మనిపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన అప్పుడొక సంచలనంగా మారింది. అయితే ఆ ఘటనకు సంబంధించి ఆస్కార్ అకాడమీకి, ఆస్కార్ నామినీలకు విల్ స్మిత్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో క్రిస్ రాక్ కు క్షమాపణ చెపుతూ ఒక పోస్ట్ ఉంచాడు. తాజాగా ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. 

క్రిస్ రాక్ చెంప పగులగొట్టిన ఘటనపై ఇంత వరకు బహిరంగంగా ఎందుకు క్షమించమని అడగలేదనే ప్రశ్న విల్ స్మిత్ కు ఎదురైంది. దీనిపై స్పందించిన విల్ స్మిత్... ఆ ఘటన జరిగిన తర్వాత క్రిస్ రాక్ తో మాట్లాడేందుకు తాను యత్నించానని... కానీ, తనతో మాట్లాడేందుకు ఆయన ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పారు. 

ఈ మేరకు ఆయన ఓ వీడియోలో వివరించాడు. 'క్రిస్ రాక్.. ఇప్పుడు అందరి ముందు నీకు క్షమాపణలు చెపుతున్నా'నని ఆయన అన్నారు. ఇది నీకు చాలదనే విషయం తనకు తెలుసని... నీవు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నీ ఒక్కడికే కాకుండా నీ కుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, ఆస్కార్ నామినీలకు, తన వల్ల ఇబ్బంది పడ్డ తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.

Will Smith
Chris Rock
Slap
Apology

More Telugu News