Kalyanram: 'బింబిసార'ను మించిన విలన్ లేడు: కల్యాణ్ రామ్

Bimbisara movie update

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్
  • రెండు కాలాల్లో నడిచే కథ
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న టీమ్  
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల

హీరోగా .. నిర్మాతగా కల్యాణ్ రామ్ చేసిన మరో ప్రయోగమే 'బింబిసార'. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా చూసిన తరువాత 'బింబిసార' వంటి విలన్ ఉండడనే విషయం మీకే అర్థమైపోతుంది. 

బాబోయ్ ఇంతటి విలనిజమా అని మీరే అంటారు. ఈ సినిమాకి హీరో అతనే .. విలన్ అతనే. ఇలాంటి పాత్రలను చేయడమే కష్టం. నా సినిమాలతో కొత్త దర్శకులు పరిచయమవుతున్నందుకు నాకు సంతోషంగానే ఉంటుంది. కొత్త దర్శకులు కొత్త కథలు తయారు చేసుకుంటే ముందుగా నాకు వినిపించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

 సినిమా పట్ల నాకు గల ఆసక్తినే వాళ్లలో అలాంటి ఒక నమ్మకాన్ని కలిగించింది గానీ, నేను ముందుగా ప్లాన్ చేసుకుని ఏమీ చేయడం లేదు. నాకు స్క్రిప్టులు చదవడం అలవాటు లేదు .. డైరెక్టర్స్ చెబితే వింటాను. కొత్త దర్శకులు కొత్త ఆలోచనలతో నన్ను కలుస్తుండటం వల్లనే ఇలాంటి ప్రాజెక్టులు రావడానికి కారణమవుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Kalyanram
Samyuktha
Catherine
Bimbisara Movie
  • Loading...

More Telugu News