Arpitha Mukherjee: ఆ గదులకు పార్థ ఛటర్జీ తాళం వేసేవారు... నన్ను రానిచ్చేవారు కాదు: అర్పిత ముఖర్జీ
- బెంగాల్ లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కాం
- క్యాబినెట్ నుంచి పార్థ ఛటర్జీ అవుట్
- ఈడీ అదుపులో పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ
- అర్పిత ఫ్లాట్లలో రూ.50 కోట్ల మేర నగదు, నగలు స్వాధీనం
పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన టీచర్ రిక్రూట్ మెంట్ కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అర్పిత ముఖర్జీకి చెందిన ఫ్లాట్లలో రూ.50 కోట్ల మేర నగదు పట్టుబడడం తెలిసిందే.
అయితే, గదులకు పార్థ ఛటర్జీ తాళం వేసేవారని, ఆ గదుల్లో నగదు నిల్వలు, విలువైన ఆభరణాలు ఉన్నాయని తనకు తెలియదని అర్పిత ముఖర్జీ ఈడీ అధికారులకు తెలిపారు. ఆ గదుల్లోకి తనను పార్థ ఛటర్జీ ఎప్పుడూ రానిచ్చేవారు కాదని ఆమె వెల్లడించారు. పార్థ ఛటర్జీ ఎప్పుడు తన ఫ్లాట్లకు వచ్చినా, ఆయన ఒక్కరే ఆ గదుల్లోకి వెళ్లేవారని అర్పిత వివరించారు.
అటు, ఈడీ అధికారులు స్పందిస్తూ, విచారణలో అర్పిత ముఖర్జీ పదేపదే విలపిస్తున్నారని, తాను అమాయకురాలినని, తనకే పాపం తెలియదని అంటున్నారని వెల్లడించారు.