Rushi Sunuk: ప్రధాని పదవి రేసులో వెనుకబడ్డానని అంగీకరించిన రుషి సునక్

Rushi Sunik accepted that he is lagging in PM race

  • రుషి సునక్, లిజ్ ట్రుస్ మధ్య పోటీ
  • ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేంత వరకు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోమన్న రుషి
  • ప్రజలకు నచ్చని రుషి వ్యాఖ్యలు

బ్రిటన్ దేశ ప్రధాని అయ్యేందుకు జరుగుతున్న పోరులో తాను వెనుకబడినట్టు భారత సంతతికి చెందిన రుషి సునక్ అంగీకరించారు. అయితే ప్రతి ఓటును సొంతం చేసుకునేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు. వ్యక్తిగత పన్నుల కోతపై ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రుస్ ఇచ్చిన హామీ ఆమెను ఆధిక్యతలో నిలిపింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేంత వరకు వ్యక్తిగత పన్నుల్లో కోత విధించే ప్రసక్తే లేదని రుషి సునక్ నిజాయతీగా చెప్పారు. 

అయితే, లిజ్ ట్రుస్ తాను ప్రధాని అయిన వెంటనే వ్యక్తిగత పన్నుల్లో కోత విధిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై రుషి సునక్ మాట్లాడుతూ, వ్యక్తిగత పన్నుల్లో కోత విధించబోనని తాను చెప్పడం ప్రజలకు నచ్చలేదని అన్నారు. తన మాటలు తన విజయావకాశాలను ప్రభావితం చేసినప్పటికీ... నిజాయతీగా చేయాల్సింది అదేనని చెప్పారు.

  • Loading...

More Telugu News