Tulasi Reddy: పోలవరం పూర్తి కావాలంటే రూ. 30 వేల కోట్లు కావాలి: తులసిరెడ్డి

Rs 30000 Cr needed for Polavaram project says Tulasi Reddy

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే  2016 నాటికే పోలవరం పూర్తయ్యేదన్న తులసిరెడ్డి 
  • టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల పోలవరం పూర్తి కాలేదని విమర్శ 
  • పోలవరం పూర్తి కావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలన్న తులసిరెడ్డి 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని విమర్శించారు. పోలవరం రాష్ట్రానికి ప్రసాదించిన వరమని చెప్పారు. పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ. 30 వేల కోట్లు కావాలని అన్నారు.

ఏపీలోని ప్రాంతీయ పార్టీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే శక్తి లేదని... సొంతంగా ప్రాజెక్టును నిర్మించే శక్తి కూడా లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందని అన్నారు.

Tulasi Reddy
Congress
Polavaram Project
BJP
Telugudesam
  • Loading...

More Telugu News