liger: లైగర్ చిత్రం నుంచి మరో సర్ ప్రైజ్​ వచ్చేసింది

Liger Official Music Video released

  • లైగర్ యాటిట్యూడ్ పేరిట మ్యూజిక్ వీడియో విడుదల చేసిన చిత్ర బృందం
  • పూరి జగన్నాథ్ సాహిత్యం.. విజయ్ ఆలపించిన పాట
  •  ఆగస్టు 25న విడుదల కానున్న చిత్రం

విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. దాంతో, ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే భారీ బడ్జెట్ తో రూపొందించారు. 

ఇటీవ‌లే విడుదలైన ట్రైల‌ర్, పాట యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు చిత్ర బృందం  లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ పేరిట అధికారిక మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేశారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా ఆల‌పించాడు. పూరి సాహిత్యం అందించాడు. లైగర్ చిత్రంలో విజయ్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా అర్థం అవుతోంది. ‘వాట్ లగా దేంగే’ అంటూ ఒక నిమిషం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్లో దూసుకెళ్తోంది. 

ఈ చిత్రాన్ని క‌ర‌ణ్‌జొహా‌ర్‌, చార్మీతో క‌లిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగస్టు 25న విడుదల కానుంది.  

liger
Vijay Devarakonda
Puri Jagannadh
song

More Telugu News