Raviteja: దివ్యాన్ష కెరియర్ కి 'రామారావు' హెల్ప్ అవుతాడా?

Ramarao On Duty movie update

  • 'మజిలీ' సినిమాతో పరిచయమైన దివ్యాన్ష
  • ఆ సినిమా హిట్ .. అయినా ఆమెకి దక్కని క్రెడిట్ 
  • ఆలస్యంగా దక్కిన మరో అవకాశం 
  • ఆశలన్నీ రవితేజ సినిమాపైనే

తెలుగు తెరకి 'మజిలీ' సినిమాతో దివ్యాన్ష కౌశిక్ పరిచయమైంది. నాగచైతన్య - సమంత జంటగా నటించిన ఆ సినిమాలో, దివ్యాన్ష ముఖ్యమైన పాత్రను పోషించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా క్రెడిట్ సమంత - చైతూ ఖాతాలోకి వెళ్లిపోయింది. 

పాపం దివ్యాన్ష గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోలేదు .. మాట్లాడుకోలేదు. దాంతో సహజంగానే ఆమెకి మరో అవకాశం రావడానికి చాలా ఆలస్యమైపోయింది. రవితేజ హీరోగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో ఆమె ఒక కథానాయికగా నటించింది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాపైనే దివ్యాన్ష ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తనకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె భావిస్తోంది. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సామ్ సీఎస్ సంగీతానికి కూడా మంచి మార్కులు పడ్డాయి. చూడాలి మరి .. ఈ సినిమా దివ్యాన్ష కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో.

Raviteja
Divyansha
Rajeesha
Ramarao On Duty Movie
  • Loading...

More Telugu News