Corona Virus: మళ్లీ 20 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 20,557 పాజిటివ్ కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,216
- 5 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు
దేశంలో కొంత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 3.96 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 20,557 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో 19,216 మంది కరోనా నుంచి కోలుకోగా... 44 మంది మృతి చెందారు. దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4.39 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా... 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు 87.40 కోట్ల కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. మరోవైపు ఇప్పటి వరకు 203.21 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 42,20,625 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 8.16 కోట్ల మంది ప్రికాషనరీ డోస్ వేయించుకున్నారు.