Arpita Mukherjee: అర్పిత ముఖర్జీ రెండో ఫ్లాట్‌లో ఈడీ సోదాలు.. రూ. 29 కోట్ల నగదు, 5 కేజీల బంగారం స్వాధీనం

Arpita Mukherjee second flat raided by ED Rs 29 crore cash handover 5 kg gold recovered

  • స్కూల్ జాబ్స్ కుంభకోణంలో ఆరోపణలు
  • మొదటి ఫ్లాట్‌లో రూ. 21 కోట్లు పట్టుబడిన వైనం
  • తాజాగా రెండో ఫ్లాట్‌పైనా అధికారుల దాడులు

స్కూల్ జాబ్స్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన మరో ఫ్లాట్‌లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల ఆమె మొదటి ఫ్లాట్‌లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 21.90 కోట్లు పట్టుబడగా, తాజాగా రెండో ఫ్లాట్‌లో నిర్వహించిన సోదాల్లో రూ. 28.90 కోట్ల నగదు, 5 కేజీలకుపైగా బంగారం, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కుంభకోణం ద్వారా కూడగట్టినదేనని అనుమానిస్తున్నారు. 

అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన ఇంట్లో దొరికిన సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో దానిని తరలించాలని అనుకున్నామని పేర్కొన్నారు. అయితే, అప్పటికే ఈడీ అధికారులు దాడి చేయడంతో దొరికిపోయారు.

  • Loading...

More Telugu News