kiccha Sudeep: కిచ్చా సుదీప్ కు రాజమౌళి శుభాకాంక్షలు

Rajamouli congratulates Kiccha Sudeep

  • ఈ రోజు విడుదలైన సుదీప్ సినిమా 'విక్రాంత్ రోణ'
  • పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో విడుదల
  • ప్రయోగాలు చేయడంలో సుదీప్ ముందుంటాడన్న రాజమౌళి

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 'బాహుబలి'లో కూడా సుదీప్ ఒక కీలక పాత్రను పోషించారు. అప్పటి నుంచి రాజమౌళి, సుదీప్ కు మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. 

సుదీప్ తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు తన మిత్రుడు సుదీప్ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. 

'ప్రయోగాలు చేయడంలో, సవాళ్లను స్వీకరించడంలో సుదీప్ ఎప్పుడూ ముందుంటాడు. 'విక్రాంత్ రోణ' చిత్రంలో ఆయన ఏం చేశాడో చూడాలని ఆత్రుతగా ఉన్నా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కిచ్చా సుదీప్ కు, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

kiccha Sudeep
Rajamouli
Vikrant Rona Movie
Tollywood
  • Loading...

More Telugu News