Raviteja: 'రామారావు' కథ చెబుతానంటే వినను పొమ్మన్నాడు: డైరెక్టర్ శరత్ మండవ

Ramarao On Duty movie update

  • 'రామారావు' ప్రమోషన్స్ లో శరత్ 
  • హీరో వేణు అంటే ఇష్టమంటూ వ్యాఖ్య 
  • ఆయనను అలా ఒప్పించానంటూ వివరణ 
  • ఈ నెల 29వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా

రవితేజ హీరోగా చేసిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ద్వారా టాలీవుడ్ కి శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. పదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన తొట్టెంపూడి వేణు, ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో శరత్ మాట్లాడుతూ .. "వేణు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్  డిఫరెంట్ గా ఉండేవి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆయన అయితే కరెక్టుగా సరిపోతాడని అనిపించింది. కాకపోతే అప్పటికే ఆయన సినిమాలు మానేసి చాలా కాలమైంది.

కథ చెప్పడానికి వేణుగారి దగ్గరికి వెళితే .. 'చేసే ఉద్దేశం లేనప్పుడు  వినడం ఎందుకండీ .. వద్దండి' అనేశారు. ఒకసారి కథ వినండి సార్ .. ఆ తరువాత మీ అభిప్రాయం చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేశాను  .. అప్పుడు ఆయన కథ విన్నారు. కథ మొత్తం విన్న తరువాత చేస్తానని చెప్పారు. అలా మొత్తానికి ఆయనను ఒప్పించగలిగాను" అని చెప్పుకొచ్చాడు.

Raviteja
Divyansha
Rajeesha
Ramarao On Duty Movie
  • Loading...

More Telugu News