single lesion: ఆ ప్రదేశాలలో చిన్న గాయం కూడా మంకీ పాక్స్ కి సంకేతం కావచ్చు: యూకే హెల్త్ ఏజెన్సీ
- జననాంగం, మలద్వారం, ముఖంపై గాయం కనిపిస్తే అనుమానించాల్సిందే
- కొత్త వ్యక్తితో సాన్నిహిత్యం, శృంగారం తర్వాత కనిపిస్తే వ్యాధి సంకేతాలే
- వ్యాధి లక్షణాలను సవరించిన యూకే హెల్త్ ఏజెన్సీ
చిన్న గాయం కూడా మంకీపాక్స్ వైరస్ కు సంకేతం కావొచ్చని బ్రిటన్ కు చెందిన హెల్త్ ఏజెన్సీ హెచ్చరించింది. అది కూడా ఓ వ్యక్తి కొత్తగా ఎవరితో అయినా శృంగారంలో పాల్గొన్న తర్వాత చిన్న గాయం కనిపిస్తే మంకీపాక్స్ గా అనుమానించాల్సి ఉంటుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. మంకీపాక్స్ వైరస్ ఇప్పటికే 75 దేశాలకు వ్యాపించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఆరోగ్య స్థితిగా ప్రకటించడం తెలిసిందే.