Rahul Dravid: ద్రావిడ్ పేరును 'డేవిడ్' అని రాసిన పత్రికా సంపాదకుడు... అది తనలో మరింత పట్టుదల పెంచిందన్న ద్రావిడ్

When Dravid name wrongly spelled as David in a paper

  • అభినవ్ బింద్రాతో ద్రావిడ్ పోడ్ కాస్ట్
  • స్కూలు రోజుల నాటి సంఘటన వెల్లడి
  • పాఠశాల క్రికెట్లో ద్రావిడ్ సెంచరీ
  • 'రాహుల్ డేవిడ్ సెంచరీ' అని రాసిన పత్రిక

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తన పాఠశాల రోజుల్లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. 'ఇన్ ద జోన్' పేరిట ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రాతో పోడ్ కాస్ట్ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, స్కూల్ క్రికెట్ లో తాను సెంచరీ చేస్తే, ఓ పత్రికా ఎడిటర్ పొరపాటు వల్ల తన పేరు ఎవరికీ తెలియకుండా పోయిందని వివరించాడు. 

తన పేరు Dravid అయితే, అలాంటి పేరు ఎవరికీ ఉండదని ఆ ఎడిటర్ భావించి ఉంటాడని, అందుకే తన పేరును David అని రాశాడని తెలిపారు. Dravid అనే పేరులోని 'ఆర్' అనే అక్షరం పొరబాటున రాసి ఉంటారని అతడు అనుకుని ఉండొచ్చని ద్రావిడ్ పేర్కొన్నారు. తాను సెంచరీ చేసినా 'ద్రావిడ్' అనే పేరుతో కాకుండా అది 'రాహుల్ డేవిడ్' అనే పేరుతో పత్రికలో ప్రచురితమైందని వెల్లడించారు. దాంతో తానెవరో తెలియకుండా పోయిందని అన్నారు. 

అయితే, ఆ సంఘటన తనకో పాఠం లాంటిదని, తన పేరు అందరికీ తెలియాలన్న పట్టుదలకు అప్పుడే బీజం పడిందని ద్రావిడ్ వెల్లడించారు. ఆ తర్వాత ద్రావిడ్ ఎంత ఎత్తుకు ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు, జట్టుకు కెప్టెన్ అయ్యాడు. రిటైర్మెంట్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ గా అనేకమంది యువ ప్రతిభావంతులకు సానబెట్టి వారిని టీమిండియా దిశగా నడిపించాడు. ప్రస్తుతం ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.

  • Loading...

More Telugu News