Rishi Sunak: నాకు అంతా కుటుంబమేనన్న రిషి సునక్.. ప్రచారం ముమ్మరం!

Rishi sunak pics with family

  • ప్రచార కార్యక్రమాల్లో భార్యా పిల్లలను వెంట పెట్టుకుని పాల్గొన్న రిషి
  • కుటుంబానికి విలువ ఇవ్వడాన్ని నమ్ముతానని వెల్లడి
  • కష్టపడి పనిచేయడం, కలిసి ఉండటాన్ని నమ్ముతానని వ్యాఖ్య

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునక్ అక్కడి ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను విస్తృతంగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో భాగంగా తన కుటుంబంతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనకు అంతా తన కుటుంబమే అంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోలతో పోస్టు పెట్టారు.

    ‘‘నాకు నా కుటుంబమే అంతా. గ్రాంథమ్ లో జరిగిన కార్యక్రమంలో నా వెంట నిలిచిన నా కుటుంబానికి కృతజ్ఞుడిగా ఉంటాను. సమగ్రత, కలిసి ఉండటం, కష్టించి పనిచేయడం, కుటుంబానికి విలువ ఇవ్వడాన్ని నేను నమ్ముతాను..” అని రిషి సునక్ ప్రకటించారు.

బ్రిటన్ తాజా మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో రిషి సునక్ ఆర్థిక మంత్రి (చాన్సెలర్ ఆఫ్ ఎక్స్‌చెకర్)గా పనిచేశారు. అనూహ్య పరిణామాల మధ్య బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో.. కన్జర్వేటివ్ పార్టీ తరఫున కొత్త నాయకుడిని ఎన్నుకునే కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రిషి సునక్ రేసులో నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. బ్రిటన్ కు తొలి భారత సంతతికి చెందిన ప్రధానిగా చరిత్ర సృష్టించనున్నారు.

Rishi Sunak
Britain
Rishi Sunak Familiy
Britain prime minister
international
  • Loading...

More Telugu News