Komatireddy Raj Gopal Reddy: కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Only BJP can defeat KCR say Komatireddy Raj Gopal Reddy

  • అమిత్ షాను మర్యాదపూర్వకంగానే కలిశాను
  • కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోకుండా పార్టీ మారను
  • పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసే వెళ్తాను

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశానని టీకాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని చెప్పారు. బీజేపీలో చేరే అంశంపై ఆయనతో చర్చించలేదని తెలిపారు. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తన అనుచరులతో చర్చించకుండా, వారి అభిప్రాయాన్ని తీసుకోకుండా తాను పార్టీ మారే నిర్ణయాన్ని తీసుకోబోనని అన్నారు. 

గతంలో తాను బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సంగతి నిజమేనని చెప్పారు. తాను ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నానని అన్నారు. కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసే వెళ్తానని అన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
Amit Shah
BJP
KCR
TRS
  • Loading...

More Telugu News