New Delhi: ఇండియాలో నాలుగుకు చేరిన మంకీపాక్స్ కేసులు.. ఢిల్లీ వ్యక్తికి పాజిటివ్

Delhi Man Tests Positive For Monkeypox

  • ఢిల్లీలో 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ
  • ఢిల్లీలో ఇదే తొలి కేసు
  • మిగతా మూడు కేరళలో నమోదు

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగో కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఢిల్లీలో ఇదే తొలి కేసు కాగా, అతడికి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేనట్టు తెలుస్తోంది. దీంతో కలుపుకుని దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకోగా, మిగతా మూడు కేరళలో నమోదయ్యాయి. 

ఢిల్లీ బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మే నెలలో ప్రతివారం ఇద్దరుముగ్గురు అనుమానితుల నుంచి నమూనాలు సేకరించగా, ఇప్పుడు ప్రతి రోజు రెండు రెండుమూడు నమూనాలు సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కోసం 16 లేబొరేటరీలు పనిచేస్తుండగా, అందులో రెండు ఒక్క కేరళలోనే ఉన్నాయి.

New Delhi
Monkeypox Virus
Kerala
  • Loading...

More Telugu News