Raviteja: టెన్షన్ పడుతున్న 'రామారావు'

Ramarao On Duty movie update

  • జోరుగా 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రమోషన్స్
  • ఇంటర్వ్యూలతో బిజీబిజీగా రవితేజ
  • రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్

'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు అలరించనున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమానే  ఇది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా టీమ్ టెన్షన్ పడుతోందని టాక్. 

ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం చాలావరకూ తగ్గించేశారు. టిక్కెట్ల రేట్లు పెంచడం .. ఓటీటీ స్టోర్స్ లో పుష్కలంగా కంటెంట్ దొరుకుతుండటం అందుకు కారణమనే అభిప్రాయలు ఉన్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ తరువాత థియేటర్స్ లో కనిపించడం లేదు. మరికొన్ని వీకెండ్ తరువాత వీకై పోతున్నాయి. 

ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 'ది వారియర్' పైన .. 'థ్యాంక్యూ' సినిమా వసూళ్ల పైన కూడా వర్షాల ప్రభావం కనిపించింది. ఇప్పుడు మరో మూడు రోజులు భారీ వర్షాలు అంటున్నారు. ఈ  నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' పరిస్థితి ఎలా ఉంటుందా అని టీమ్ టెన్షన్ పడుతుందట. ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన 'క్రాక్' మాదిరిగా ఈ సినిమా కూడా హిట్ కొడుతుందేమో చూడాలి మరి.

Raviteja
Divyansha
Sharth Mandeava
Rama Rao On Duty Movie
  • Loading...

More Telugu News