Akhil: అఖిల్ .. చైతూ .. ఓ మల్టీస్టారర్!

Srikanth Addala movie update

  • అఖిల్ కోసం కథ రెడీ చేసిన శ్రీకాంత్ అడ్డాల 
  • చైతూ కోసం మార్పులు చెప్పిన నాగ్ 
  • మల్టీస్టారర్ గా మార్చే ప్రయత్నమంటూ టాక్  
  • అన్నపూర్ణ బ్యానర్లోనే నిర్మించే అవకాశం   

ఒక వైపున చైతూ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. మరో వైపున అఖిల్  కూడా తనకి నచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావడంలో చైతూ కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. కానీ అఖిల్ అసలు ఆ వైపు వెళ్లే ప్రయత్నమే చేయలేదు. 

ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాల ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ను రెడీ చేసుకుని వచ్చి , అఖిల్ కోసం నాగార్జునకి వినిపించాడట. ఆ కథలో కొత్త పాయింట్ ఉంది. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడమెలాగో శ్రీకాంత్ అడ్డాలకి తెలుసు. అందువలన నాగ్ ఆ కథపై ప్రత్యేకమైన శ్రద్ధనే పెట్టారని అంటున్నారు.   

ఈ కథలో అఖిల్ తో పాటు చైతూ కూడా చేసే అవకాశం ఉండేలా మార్పులు చేసి .. మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా మార్చమని నాగ్ చెప్పారట. దాంతో శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడని అంటున్నారు. అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Akhil
Naga Chaitanya
Srikanth Addala Movie
  • Loading...

More Telugu News