Dasarthi Krishnamacharya: దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న వేణు సంకోజు.. ఫొటోలు ఇవిగో

ts minister handed over dasarathi award to venu sankoju
  • దాశ‌ర‌థి సంస్మ‌ర‌ణార్థం ఏర్పాటు చేసిన పుర‌స్కారం
  • ఈ ఏడాదికి వేణు సంకోజును ఎంపిక చేసిన ప్ర‌భుత్వం
  • ర‌వీంద్ర భార‌తిలో పుర‌స్కారం అంద‌జేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌
తెలంగాణ ప్ర‌ముఖ క‌వి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య సంస్మ‌రణార్థం తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన దాశ‌ర‌థి సాహితీ పుర‌స్కారాన్ని ప్ర‌ముఖ క‌వి వేణు సంకోజు అందుకున్నారు. దాశ‌ర‌థి 98వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని రవీంద్ర భార‌తిలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుర‌స్కారాన్ని వేణు సంకోజుకు అంద‌జేశారు. 

ఈ సంద‌ర్భంగా దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్యకు మంత్రి నివాళి అర్పించారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు హాజ‌ర‌య్యారు.
Dasarthi Krishnamacharya
Telangana
Venu Sankoju
TRS
V Srinivas Goud

More Telugu News