Natyam: అజ‌య్ దేవ్‌గ‌ణ్‌కూ ఉత్త‌మ న‌టుడి అవార్డు.. 2 అవార్డులు ద‌క్కించుకున్న నాట్యం

telugu movie natyam grabs 2 national awards

  • తానాజీ సినిమాకు దేవ్‌గ‌ణ్‌కు అవార్డు
  • నాట్యం సినిమాకు రెండు జాతీయ అవార్డులు
  • జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా క‌ల‌ర్ ఫొటో
  • అల వైకుంఠ‌పురంలో సంగీతానికి త‌మ‌న్‌కు అవార్డు

68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల్లో భాగంగా జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపికైన సూర్య‌తో పాటు బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ (తానాజీ) ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రంగా కుంకుం అచ్చ‌న సినిమా ఎంపికైంది. అడ్మిటెడ్ సినిమాకు స్పెష‌ల్ జ్యూరీ అవార్డు లభించింది. ఈ ద‌ఫా ఉత్త‌మ క్రిటిక్స్ అవార్డును ప్ర‌క‌టించ‌డం లేద‌ని కేంద్రం తెలిపింది. 

ఇక తెలుగు సినిమాల విష‌యానికి వస్తే... నాట్యం సినిమాకు రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. కొరియోగ్ర‌ఫీ (సంధ్యారాజు) పాటు మేక‌ప్ (టీవీ రాంబాబు) విభాగాల్లో నాట్యం సినిమా అవార్డుల‌ను ద‌క్కించుకుంది. ఇక జాతీయ ఉత్త‌మ తెలుగు చిత్రంగా క‌ల‌ర్ ఫొటో ఎంపిక కాగా... తెలుగు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్ (అల వైకుంఠ‌పురంలో) ఎంపిక‌య్యారు.

Natyam
Tollywood
National Film Award
Makeup
Choreography
Colour Photo
Thaman
  • Loading...

More Telugu News