Ram: ఆ కథతో రామ్ ను రంగంలోకి దింపుతున్న దిల్ రాజు?

Ram in Venu Sriram movie

  • బన్నీ ఇక 'ఐకాన్' ప్రాజెక్టు చేయనట్టే 
  • ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్
  • కథానాయికగా తెరపైకి రష్మిక పేరు 
  • వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం

ఒక వైపున దిల్ రాజు .. మరో  వైపున దర్శకుడు వేణు శ్రీరామ్. ఇద్దరి మధ్య చాలాకాలంగా 'ఐకాన్' కథ నలుగుతోంది. బన్నీతో చేద్దామని చూశారు .. కానీ కుదరలేదు. ఆయన రేంజ్ కి తగినట్టుగా పాన్ ఇండియా స్థాయిలో మార్పులు చేయూలని చూశారు .. అయినా వర్కౌట్ కాలేదు.

ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ కథలో హీరో పాత్రకిగల ఎనర్జీకి రామ్ అయితే బాగుంటుందని భావించి ఆయనకి కథ చెప్పారట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన మార్పులు రామ్ చెప్పడంతో, అందుకు తగినట్టుగా చేయడానికి ఇద్దరూ ఓకే చెప్పారని సమాచారం.

 ప్రస్తుతం వేణు శ్రీరామ్ ఆ మార్పులను చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. టైటిల్ కూడా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామ్ త్వరలో బోయపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ సినిమా షూటింగు పూర్తయిన తరువాత దిల్ రాజు ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది.

Ram
Rashmika Mandanna
Dil Raju
venu Sriram Movie
  • Loading...

More Telugu News