Tollywood: మంచు సిస్టర్స్ వస్తున్నారు!

Manchu Vishnu twin daughters makes debut in his next film

  • మోహన్ బాబు కుటుంబం నుంచి  పరిశ్రమలోకి మూడో తరం
  • జిన్నా సిమిమాతో మంచు విష్ణు కూతుళ్లు అరియాన, వివియాన తెరంగేట్రం
  • ప్రత్యేక పాటలో నటించిన మంచు వారసులు 

నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. తర్వాత ఆయన కుటుంబం నుంచి మంచు లక్ష్మితో పాటు విష్ణు, మనోజ్ కూడా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. నటులుగానే కాక నిర్మాతలుగానూ కొనసాగుతున్నారు. ఇప్పుడు మంచు కుటుంబం నుంచి మూడో తరం కూడా సినిమాల్లోకి వస్తోంది. ఇప్పటికే సొంత బ్యానర్‌‌ సినిమాలకు సమర్పకులుగా వ్యవహరిస్తున్న విష్ణు కూతుళ్లు అరియాన, వివియాన త్వరలో వెండితెరపై కూడా కనిపించబోతున్నారు. 

    విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘జిన్నా’ చిత్రంలోని ఓ పాటను కలిసి పాడడంతో పాటు ఇద్దరూ నటించారు. స్నేహం గొప్పతనం చాటేలా ఉండే ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. తన ఇద్దరు కూతుళ్లు యాక్టర్స్‌ అవ్వాలనేది తన కోరిక అని మంచు విష్ణు చెప్పాడు. ఆ ప్రయత్నానికి ప్రేక్షకుల ఆశీస్సులు, అభినందనలు కావాలని విష్ణు కోరాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ లేఖ కూడా షేర్ చేశాడు. 

‘జిన్నా’ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ కాగా.. ప్రేమ్ రక్షిత్ నృత్యాలు కంపోజ్ చేస్తున్నారు. 

Tollywood
Manchu Vishnu
Mohan Babu
daughters
ginna movie

More Telugu News