kiccha sudeep: మీడియా మిత్రులందరికీ క్షమాపణలు చెపుతున్నా: కిచ్చా సుదీప్

Kiccha Sudeep says sorry to media

  • ఈ నెల 28న విడుదలవుతున్న సుదీప్ తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' 
  • ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్లు పెట్టాల్సిన వైనం
  • అనారోగ్యం వల్ల ప్రెస్ మీట్లు రద్దు చేశామన్న సుదీప్

మీడియా ప్రతినిధులకు ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్ మీట్లకు హాజరు కాలేకపోతున్నానని... తనను క్షమించాలని కోరాడు. సుదీప్ తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి అనూప్ బండారి దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. 

సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్స్ నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం వల్ల ప్రయాణాలు చేయలేకపోతున్నానని... అందుకే ఈ రోజు జరగాల్సిన ప్రెస్ మీట్స్ రద్దు చేస్తున్నామని చెప్పారు. కోలుకున్న వెంటనే ప్రెస్ మీట్స్ నిర్వహిస్తామని... త్వరలోనే అందరినీ కలుస్తానని తెలిపారు.

More Telugu News