Nitya Menon: తన పెళ్లి వార్తలపై స్పందించిన నిత్యా మీనన్

Nitya Menon responds on marriage rumors

  • మలయాళ స్టార్ హీరోతో రొమాన్స్ అంటూ ప్రచారం
  • పెళ్లిపీటలు ఎక్కబోతోందని కథనాలు
  • ఖండించిన నిత్యా మీనన్
  • నిజానిజాలు తెలుసుకుని ప్రచురించాలని హితవు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతురాలైన నటిగా నిత్యా మీనన్ కు గుర్తింపు ఉంది. ఈ మలయాళ ముద్దుగుమ్మ అనేక విలక్షణమైన పాత్రలతో తెలుగు, తమిళ, మలయాళ తదితర దక్షిణాది భాషల ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే, ఇటీవల నిత్యా మీనన్ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. మలయాళ స్టార్ హీరోతో ప్రేమాయణం అంటూ కేరళ వెబ్ సైట్లలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. 

దీనిపై నిత్యా మీనన్ స్పందించింది. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. ఇలాంటి కథనాలను ప్రచురించేముందు ఓసారి నిర్ధారణ చేసుకుంటే బాగుంటుందని హితవు పలికింది. నిజాలను ప్రచురిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించింది. నిత్యా మీనన్ ఇటీవల పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటించి మెప్పించింది. ఆమె నటించిన మోడ్రన్ లవ్ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతోంది.

Nitya Menon
Romance
Marriage
Star Hero
Malayalam
Kerala
  • Loading...

More Telugu News