Naga Chaitanya: ఈ ఏడాదైనా మాళవిక నాయర్ కి కలిసొచ్చేనా?

Malavika Upcoming Movies

  • 'ఎవడే సుబ్రమణ్యం'తో పరిచయమైన మాళవిక
  • వరుసగా ఎదురైన పరాజయాలు
  • ఈ నెల 22న రానున్న 'థ్యాంక్యూ'
  • ఈ ఏడాదిలోనే రానున్న మరో రెండు సినిమాలు

అందమైన రూపం .. ఆకర్షణీయమైన కళ్లు మాళవిక నాయర్ సొంతం. చాలా కాలం క్రితమే ఆమె 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా హిట్ అయినప్పటికీ, ఆ తరువాత ఆమె ఎంచుకున్న సినిమాలు నిరాశపరిచాయి. దాంతో ఆశించినస్థాయిలో వరుస సినిమాలు చేయలేకపోయింది. 

నాగశౌర్య జోడీగా చేసిన 'కల్యాణ వైభోగమే' ..  కల్యాణ్ దేవ్ సరసన చేసిన 'విజేత' .. రాజ్ తరుణ్ తో చేసిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. దాంతో అందం .. అభినయం ఉన్నప్పటికీ సహజంగానే వెనుకబడిపోయింది. కానీ ఇప్పుడు ఆమె తన జోరును పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. 

చైతూ సరసన నాయికగా ఆమె చేసిన 'థ్యాంక్యూ' ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. పెద్ద బ్యానర్లో ..  స్టార్ డైరెక్టర్ తో చేసిన ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. 'అన్నీ మంచి శకునములే' కూడా రెడీ అవుతున్నాయి. చూస్తుంటే ఈ ఏడాది ఆమెకి కలిసొచ్చేలానే అనిపిస్తోంది మరి.

Naga Chaitanya
Malavika Nair
Thank You Movie
  • Loading...

More Telugu News