Naga Chaitanya: 'థ్యాంక్యూ' సినిమాను తమన్ మరోస్థాయికి తీసుకెళ్లాడు: దిల్ రాజు 

Thank you movie press meet

  • దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న 'థ్యాంక్యూ'
  • విక్రమ్ కుమార్ గొప్పగా తీర్చిదిద్దాడంటూ కితాబు
  • తమన్ నెక్స్ట్  లెవెల్ కి తీసుకుని వెళ్లాడంటూ ప్రశంసలు 
  • తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన దిల్ రాజు 

చైతూ .. రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ రూపొందించిన 'థ్యాంక్యూ' సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాను విక్రమ్ కుమార్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. టెక్నీషియన్స్ అంతా ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లారు.

ప్రతి ఒక్కరూ ఈ సినిమా ఒక దృశ్యకావ్యంగా రావడం కోసం కష్టపడ్డారు. ఈ సినిమాకి తమన్ చేసిన పాటలు ఒక ఎత్తయితే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక ఎత్తు. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలను కనెక్ట్ చేయడంలో తను కీలకమైన పాత్రను పోషించాడు. ఎంతసేపూ నా సినిమాను నేను చూసి బాగుందని అనుకోను. ఇద్దరు బయట వ్యక్తులకు కూడా నా సినిమాలు చూపిస్తుంటాను. 

అలాగే ఈ సినిమాను కూడా 50 ప్లస్ ఉన్న ఒక వ్యక్తికీ .. 25 ప్లస్ ఉన్న వ్యక్తికి చూపించాను. వాళ్లిద్దరూ కూడా సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుందని భావిస్తున్నాము. తప్పకుండా ఈ సినిమాను ఆడియన్స్ ఎక్కడికో తీసుకెళతారని నమ్ముతున్నాము" అంటూ చెప్పుకొచ్చారు.

Naga Chaitanya
Rashi Khanna
Vikram Kumar
Dil Raju
  • Loading...

More Telugu News