Naga Chaitanya: అదే విక్రమ్ కుమార్ గొప్పతనం: చైతూ

Thanak You Movie  Update

  • 'థ్యాంక్యూ' ప్రెస్ మీట్ లో పాల్గొన్న చైతూ
  • ఈ కథ ఒక అందమైన జర్నీలా సాగుతుందంటూ వివరణ   
  • ఇలాంటి పాత్రను ఇంతకుముందు చేయలేదని వ్యాఖ్య 
  • తన కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోతుందంటూ స్పష్టీకరణ

నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కుమార్ 'థ్యాంక్యూ' సినిమాను రూపొందించాడు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో విక్రమ్ కుమార్ .. దిల్ రాజు .. బీవీఎస్ రవి .. చైతూ పాల్గొన్నారు.  

ఈ వేదికపై చైతూ మాట్లాడుతూ .. "ఒక నటుడిగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఇలాంటి ఒక పాత్రను చేసే అవకాశం అరుదుగా లభిస్తూ ఉంటుంది. విక్రమ్ కుమార్ గారు మంచి రైటర్  .. ఆయన దగ్గరే ఎన్నో మంచి కథలు ఉన్నాయి. అయినా బీవీఎస్ రవిగారి కథ వినగానే  .. తప్పకుండా చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు .. అది ఆయన గొప్పతనం. ఆయనతో మరి సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. 

ఈ సినిమా చేయడం వలన నేను అనేక విషయాలను నేర్చుకున్నాను. అలాగే ఎన్నో అనుభవాలతో థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికి వస్తారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ గారు ..  తులసి గారు పాత్రలు కూడా నాతో ట్రావెల్ అవుతుంటాయి. మిగతా పాత్రలు ఇచ్చే సపోర్టుతోనే నా జర్నీ నడుస్తుంటుంది" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News