Kolkata: కోల్ కతాలో మరో మోడల్ ఆత్మహత్య

Model Puja Sarkar suicide

  • 21 ఏళ్ల మోడల్ పూజ ఆత్మహత్య
  • బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత సూసైడ్ చేసుకున్న వైనం
  • ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

కోల్ కతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సమస్యలు, సరైన అవకాశాలు రాకపోవడం, రిలేషన్ షిప్స్ దెబ్బతినడం వంటి కారణాల వల్ల వీరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా కోల్ కతాకు చెందిన మరో మోడల్ పూజ సర్కార్ (21) ఆత్మహత్య చేసుకుంది. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకుంది. తన బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

More Telugu News