India: శ్రీలంకలో భారతీయ అధికారిపై దాడి.. తీవ్రంగా గాయపడిన వివేక్ వర్మ

Indian Official Attacked In Sri Lanka

  • భారత వీసా కేంద్రం డైరెక్టర్ వివేక్‌వర్మపై దాడి
  • కొలంబో సమీపంలో దాడిచేసిన దుండగులు
  • అధికారుల దృష్టికి తీసుకెళ్లిన భారత హైకమిషన్

శ్రీలంకలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భారత వీసా కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న వివేక్‌వర్మపై సోమవారం రాత్రి కొలంబో సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు భారత హైకమిషన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడి ఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితిలో శ్రీలంకలోని భారతీయులు తాజా పరిణమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించవచ్చని తెలిపింది. ఇరు దేశాల ప్రజల మద్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని మరో ట్వీట్‌లో పేర్కొంది.

India
Sri
Vivek Varma
Indian High Commission
  • Loading...

More Telugu News