Naga Chaitanya: 12 ఏళ్ల తరువాత ఇప్పుడు కుదిరింది: చైతూ

Thank you movie update

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'థ్యాంక్యూ'
  • అనుభవాలు .. అనుభూతుల చుట్టూ తిరిగే కథ 
  • చాలా గ్యాప్ తరువాత దిల్ రాజు బ్యానర్లో చేసిన చైతూ
  • ఈ నెల 22వ తేదీన విడుదలవుతున్న సినిమా  

నాగచైతన్య తాజా చిత్రంగా విక్రమ్ కుమార్ రూపొందించిన 'థ్యాంక్యూ' సినిమా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. తాజా ఇంటర్యూలో చైతూ మాట్లాడుతూ .. 'జోష్' సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది దిల్ రాజుగారే. ఆ తరువాత  కూడా ఆయన చాలా కథలను నా దగ్గరికి పంపించారు. 

సరైన కథ పడినప్పుడు చేయాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. అలా వెయిట్ చేస్తూ ఉండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. విక్రమ్ కుమార్ గారు బీవీఎస్ రవి గారిని తీసుకొచ్చి ఈ కథను వినిపించినప్పుడు మాత్రం వెంటనే ఒప్పేసుకున్నాను. అందుకు కారణం కథలోని కొత్తదనం .. పాత్రలోని వైవిధ్యం. 

దిల్ రాజు గారితో 12 ఏళ్ల  గ్యాప్ వచ్చిందనే బాధకంటే కూడా, ఒక మంచి సినిమా చేశామని ఆనందమే ఎక్కువగా ఉంది. 'ప్రేమమ్' కథకి .. ఈ కథకి ఎలాంటి పోలికలు ఉండవు. అనుభవం .. అనుభూతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా నాకు మాత్రమే కాదు .. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ లకు కూడా మంచి  పేరు తీసుకొస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya
Rashi Khanna
Vikram Kumar
Thank You Movie
  • Loading...

More Telugu News