Edappadi Palaniswami: పన్నీర్ సెల్వం స్థానంలో ఉదయ్ కుమార్ ను నియమించిన పళనిస్వామి

Palaniswami appoints Uday Kumar in Pannerselvam place

  • ఇప్పటికే పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించిన పళనిస్వామి
  • ఆయన స్థానంలో మాజీ మంత్రి ఉదయ్ కుమార్ ను ఎన్నుకున్న పార్టీ
  • ఉదయ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్న పళనిస్వామి

మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. పన్నీర్ బహిష్కరణతో ఖాళీ అయిన స్థానాన్ని (అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్) అన్నాడీఎంకే భర్తీ చేసింది. పన్నీర్ స్థానంలో మాజీ మంత్రి ఆర్.బీ.ఉదయ్ కుమార్ ను నియమించింది. ఈ సందర్భంగా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మాట్లాడుతూ... ఉదయ్ కుమార్ ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. ఈ నెల 17న జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఉదయ్ కుమార్ ను ఎన్నుకున్నామని తెలిపారు. మరోవైపు లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ సెక్రటరీగా ఎస్ఎస్ కృష్ణమూర్తిని ఎన్నుకున్నట్టు వెల్లడించారు.

Edappadi Palaniswami
Panneerselvam
Uday Kumar
AIADMK
  • Loading...

More Telugu News