Mangal Pandey: స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండేకు మోదీ నివాళి... ఫొటో ఇదిగో
- స్వాతంత్య్ర సంగ్రామంలో మంగళ్ పాండే కీలక భూమిక
- నేడు మంగళ్ పాండే జయంతి
- మీరట్‌లో ఆయన విగ్రహం ముందు నివాళి అర్పించిన మోదీ
- మంగళ్ పాండే జీవితం ఆధారంగా ఆమిర్ ఖాన్ చిత్రం
భారత స్వతంత్ర సంగ్రామంలో ఎందరో వీరులు ఆంగ్లేయుల పాలనకు వెన్నుచూపకుండా పోరాడారు. వారిలో మంగళ్ పాండే ఒకరు. బాలీవుడ్ మిస్టర్ ఫెర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మంగళ్ పాండే పేరిట ఓ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. మంగళవారం మంగళ్ పాండే జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ వీరుడికి నివాళి అర్పించారు.
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో మంగళ్ పాండేకు చెందిన నిలువెత్తు విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం వద్దకు మంగళవారం వెళ్లిన మోదీ... స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళి అర్పించారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోదీ... మంగళ్ పాండే వీరత్వాన్ని కీర్తించారు. ఓ సంకల్పంతో ధైర్యంగా ముందుకు సాగిన మంగళ్ పాండే వేలాది మంది భారతీయుల్లో పోరాట పటిమను రగిల్చారని ఆయనను మోదీ కీర్తించారు.