Ram: రామ్ ను లైన్లో పెట్టిన శ్రీను వైట్ల!

Ram in Srinu Vaitla movie

  • రామ్ తాజా చిత్రంగా వచ్చిన 'ది వారియర్'
  • తరువాత సినిమా బోయపాటి దర్శకత్వంలో 
  • పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న  సినిమా 
  • లైన్లోనే ఉన్న శ్రీను వైట్ల  

శ్రీను వైట్ల .. ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో ముందు వరుసలో కనిపించాడు. ఆ తరువాత కాలంలో వరుస ఫ్లాపులు ఎదురవుతూ వచ్చాయి. మంచు విష్ణుతో 'ఢీ' సీక్వెల్ చేయనున్నట్టు కొంతకాలం క్రితమే చెప్పాడు .. టైటిల్ పోస్టర్ ను కూడా వదిలారు. కానీ ఆ ప్రాజెక్టు సంగతి ఎంతవరకూ వచ్చిందనేది తెలియదు.

కానీ రామ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. గతంలో రామ్ కి 'రెడీ' సినిమాతో శ్రీను వైట్ల భారీ హిట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్లనే రామ్ కి శ్రీను వైట్ల ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు.

రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన 'ది వారియర్' థియేటర్స్ లోనే ఉంది. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత శ్రీను వైట్ల సినిమా చేయవచ్చనేది బయట వినిపిస్తున్న మాట.

Ram
Srinu Vaitla
Tollywood
  • Loading...

More Telugu News