Kiran Abbavaram: నాపై జరుగుతున్న ప్రచారానికి కారణమదే: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Interview

  • రెండు ఫ్లాపులు అందుకున్న కిరణ్ అబ్బవరం 
  • లైన్లో ఉన్న మూడు ప్రాజెక్టులు
  • బలమైన నేపథ్యం ఉందంటూ  ప్రచారం 
  • అసూయనే అందుకు కారణమన్న హీరో

కిరణ్ అబ్బవరం హీరోగా వరుస సినిమాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల నుంచి ప్రకటనలు వచ్చాయి. దాంతో చాలామంది ఆశ్చర్యపోయారు. 

ఎలాంటి నేపథ్యం లేకపోతే పెద్ద పెద్ద బ్యానర్లలో అవకాశాలు ఎలా వస్తాయి? ఎవరు ఇస్తారు? స్టేజ్ పై అతనిని ఇంతలా ఎందుకు పొగుడుతారు? ఫ్లాపులు పడుతున్నా ఎవరు ప్రోత్సహిస్తారు? అనే సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ విషయంపై కిరణ్ అబ్బవరం స్పందించాడు.

"మనకి మార్కులు తక్కువొచ్చినా ఫర్లేదు.. పక్కోడికి మాత్రం ఎక్కువ రాకూడదనే అసూయనే నాపై జరుగుతున్న ఈ ప్రచారానికి కారణం. నాకు ఎలాంటి నేపథ్యం లేదన్నది నిజం. నాకు ఇన్ని అవకాశాలు రావడానికి కారణం నా హార్డ్ వర్క్. నా గురించి నెగెటివ్ గా ప్రచారం జరుగుతుందంటే..  పాజిటివ్ రూట్ లోనే వెళుతున్నానని అర్థం" అంటూ  చెప్పుకొచ్చాడు.

Kiran Abbavaram
Tollywood
  • Loading...

More Telugu News