Bonalu: 2 వేల మంది మహిళలతో కలిసి బోనం ఎత్తిన కల్వకుంట్ల కవిత... ఫొటోలు ఇవిగో
![trs mlc kavitha offers bonam to mahankali ammavaru with 2 thousand ladies](https://imgd.ap7am.com/thumbnail/cr-20220717tn62d3c25aa6c21.jpg)
- ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన బోనాలు
- మహంకాళి ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు
- కవిత ఫొటోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన మంత్రి తలసాని
హైదరాబాద్లో బోనాల జాతర కోలాహలం ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సికింద్రాబాద్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం అయ్యింది. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో హైదరాబాదీలు మహంకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు.
ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బోనం ఎత్తారు. ఏకంగా 2 వేల మంది మహిళలతో ఆమె ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ లోని ఆదయ్య నగర్ లైబ్రరీ నుండి 2 వేల మంది మహిళలతో బయలుదేరిన కవిత ఆ తర్వాత అమ్మవారికి బోనం సమర్పించారు. భారీ సంఖ్యలో మహిళలతో తరలివస్తున్న కవిత ఫొటోలను మంత్రి శ్రీనివాస యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.