Goa: గోవా కాంగ్రెస్‌లో లుకలుకలు.. ఐదుగురు ఎమ్మెల్యేలు చెన్నైకి తరలింపు

Amid split rumours Goa Congress shifts 5 MLAs to Chennai

  • బీజేపీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌‌లో ఉన్నారన్న ప్రచారం
  • సొంతపార్టీ నేతలే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపాటు
  • అలాంటి ఆలోచనేదీ లేదన్న మైఖేల్ లోబో

కాంగ్రెస్ పార్టీకి ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమికి తోడు పలువురు నేతలు పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్ కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు ఇటీవల కలకలం రేపాయి. ఆ పార్టీకి చెందిన సంకల్ప్‌ అమోంకర్‌, ఆల్టోన్‌ డికోస్టా, కార్లోస్‌ ఆల్వారెస్‌, రుడాల్ఫ్‌ ఫెర్నాండెజ్‌, యూరి అలెమో బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ఐదుగురు శాసనసభ్యులను చెన్నైకి తరలించినట్టు తెలుస్తోంది.
  
మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారంటూ సొంతపార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్న మైఖేల్ లోబోను కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పదవి నుంచి తప్పించి, సంకల్ప్ అమోంకర్‌ను ఆ స్థానంలో నియమించింది. పార్టీలో తాజా పరిణామాలపై గోవా కాంగ్రెస్ ఇన్‌చార్జ్  దినేశ్ గుండూరావు స్పందించారు. బీజేపీతో కలిసి పార్టీని బలహీన పరిచేందుకు సొంతపార్టీ నాయకులే కుట్ర పన్నారని ఆరోపించారు. కాగా, బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను మైఖేల్ లోబో ఖండించారు. తమకు అలాంటి ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News