IPL: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ రెండున్నర నెలలు... ఓకే చెప్పిన ఐసీసీ

ICC formally reserves slot for two and half month IPL

  • 2023 సీజన్ నుంచి ఐపీఎల్ లో మరిన్ని మ్యాచ్ లు
  • మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకు ఐపీఎల్
  • విండో రిజర్వ్ చేసిన ఐసీసీ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ ను సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు జరపడం ద్వారా టోర్నీని మరింత జనరంజకం చేసేందుకు బీసీసీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సానుకూలంగా స్పందించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతిపాదించిన మేరకు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ ను రెండున్నర నెలల పాటు నిర్వహించేందుకు ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు రెండున్నర నెలల ఐపీఎల్ కు తన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్ టీపీ)లో స్థానం కల్పించింది. 

2023 నుంచి 2027 వరకు వివిధ దేశాల క్రికెట్ జట్ల పర్యటనలు, ఆయా లీగ్ ల నిర్వహణను నిర్ధారించి తాజా ఎఫ్ టీపీ రూపొందించారు. దీని ప్రకారం మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకు ఐపీఎల్ కోసం కేటాయించారు. 

అటు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే టీ20 లీగ్ ల కోసం కూడా నూతన ఎఫ్ టీపీలో స్థానం కల్పించారు. జులై-ఆగస్టు నెలల్లో ఇంగ్లండ్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ లేవీ ఆడడంలేదు. ఆ సమయంలో ఇంగ్లండ్ లో హండ్రెడ్ పేరిట టీ20 లీగ్ నిర్వహించే ప్రతిపాదనలు ఉన్నాయి. 

ఇక, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ బిగ్ బాష్ లీగ్ కోసం జనవరిలో విండో కేటాయించాలని ఐసీసీని కోరింది. దీనిపైనా ఐసీసీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

IPL
Window
ICC
BCCI
  • Loading...

More Telugu News