YSRCP: జ‌గ‌న్ బాట‌లోనే వైసీపీ ఎమ్మెల్యే!... ఆటో డ్రైవ‌ర్‌గా మారిన శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే!

srikalahasti mla biyyapu madhusudhan reddy drives auto

  • విశాఖ‌లో ఆటో డ్రైవ‌ర్ చొక్కాలో క‌నిపించిన సీఎం జ‌గ‌న్‌
  • శ్రీకాళ‌హ‌స్తిలో ఆటో డ్రైవ‌ర్ల‌తో ఎమ్మెల్యే మ‌ధుసూద‌న‌రెడ్డి భారీ ర్యాలీ
  • స్వ‌యంగా ఆటో న‌డుపుతూ సాగిన వైసీపీ ఎమ్మెల్యే

వైఎస్సార్ వాహ‌న‌మిత్ర ప‌థ‌కం నాలుగో విడ‌త నిధుల విడుద‌ల సంద‌ర్భంగా విశాఖ‌లో ఆటో డ్రైవ‌ర్ చొక్కా వేసిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కార్య‌క్ర‌మం సాంతం అదే డ్రెస్‌లో సాగిన సంగ‌తి తెలిసిందే. కార్య‌క్ర‌మంలో భాగంగా ఓ మ‌హిళా డ్రైవ‌ర్ న‌డుపుతున్న ఆటోలో జ‌గ‌న్ కూర్చున్నారు. ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌నే అనుస‌రిస్తూ శ్రీ బాలాజీ జిల్లా శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న బియ్య‌పు మ‌ధుసూద‌న‌రెడ్డి కూడా ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. 

శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో వైఎస్సార్ వాహ‌న‌మిత్ర నిధుల విడుద‌ల సంద‌ర్భంగా ఆటో డ్రైవర్లు, వారి ఆటోల‌తో పట్ట‌ణంలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవ‌ర్ చొక్కా వేసిన మ‌ధుసూద‌న‌రెడ్డి ఏకంగా డ్రైవ‌ర్ సీట్లో కూర్చుని ఆటో న‌డుపుతూ ర్యాలీకి నేతృత్వం వ‌హించారు. ఈ ఫొటోల‌ను ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

YSRCP
YSR Vahana Mithra
Sri Balaji District
Biyyapu MadhuSudhan Reddy
Srikalahasti

More Telugu News