Surya: మరో మల్టీస్టారర్ కి నాని గ్రీన్ సిగ్నల్?

 Nani in Sudha Kongara Movie

  • సుధ కొంగర నుంచి మల్టీ స్టారర్
  • సూర్య - దుల్కర్ సల్మాన్ ఎంపిక పూర్తి
  • నానీని సంప్రదించినట్టుగా టాక్ 
  • త్వరలో రానున్న స్పష్టత

నాని విభిన్నమైన .. విలక్షణమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కథ నచ్చితే మల్టీ స్టారర్ లు చేయడానికి కూడా నాని వెనుకాడడు. గతంలో నాగార్జునతో కలిసి 'దేవదాసు' .. ఆది పినిశెట్టితో కలిసి 'నిన్నుకోరి' సినిమాలు చేశాడు. ఇప్పుడు మరో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఒక టాక్ నడుస్తోంది. 

'కేజీఎఫ్' సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు పాన్ ఇండియా సినిమాగా 'సలార్' సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ప్రాజెక్టును వారు సుధ కొంగర దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో సూర్య -  దుల్కర్ నటించనున్నారని అంటున్నారు. 

ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం నానిని సంప్రదించినట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ సుధ కొంగర కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని చెబుతున్నారు. జోరుగా షికారు చేస్తున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

Surya
Dulquer Salmaan
Nani
Sudha Kongara Movie
  • Loading...

More Telugu News